రాజ్యసభ సభ్యుల్లోనే అత్యంత ధనవంతురాలు

news02 March 13, 2018, 9:55 a.m. general

బాలీవుడ్ నటి… బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి , రాజ్యసభ అభ్యర్ధి జయాబచ్చన్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? అక్షరాల వెయ్యికోట్ల రూపాయలు. తాజాగా ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ వివరాలు గమనిస్తే రాజ్యసభ సభ్యుల్లోనే ఆమె అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఎంపీగా రాజ్యసభ బరిలోకి దిగిన జయాబచ్చన్ తన నామినేషన్ పత్రంలో తన ఆస్తి వెయ్యికోట్లుగా చూపించారు. ఇక ఆమె ఆస్తుల వివరాల్లోకి వెళ్తే.. ఆమె దగ్గర రూ.62 కోట్ల రూపాయల విలువైన బంగారం ఉందట. మొత్తం రూ.13 కోట్ల విలువ చేసే 12 కార్లు ఉన్నాయట. అందులో రోల్స్ రాయిస్, మూడు మెర్సిడెస్, ఒక ఫోర్డ్, రేంజ్

రోవర్, టాటా నానో కార్లతో పాటు ఓ ట్రాక్టర్ ఉందని ఆమె వెల్లడించారు. ఇక జయ, అమితాబ్ లకు ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్ లో 3,175 చదరపు గజాల విస్తీర్ణంలో భవనం ఉందట. వీటితో పాటు నోయిడా, భోపాల్, పూణే, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో వారికి ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అంతేనా అమితాబ్ కు ఏకంగా రూ.9 లక్షలు విలువ చేసే పెన్ ఉందట. ఇక జయాబచ్చన్ కు లక్నోలో రూ.2.2 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, అమితాబ్ కి దౌల్తాపూర్ లో రూ.5.7 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమి ఉందట.. ఈ విషయాన్నీ జయ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తానికి జయ ఆస్తులు గతంతో పోలిస్తే కోట్లలో రెట్టింపైనట్లు తెలుస్తోంది.

tags: jayabatchan, assets, samajwadiparty, rajyasabha, bigb

Related Post