సినీ పరిశ్రమ ధిగ్భ్రాంత్రి

news02 Nov. 25, 2018, 1 p.m. general

ambarish

కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్‌ మరణంపై చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారనుకోలేదని సినీ ప్రముఖులు ఆవేధన వ్యక్తం చేశారు. అంబరీష్ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నాచేశారు.

సంతాపం తెలిపిన సందేశం వారి మాటల్లోనే...

నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈరోజు నన్ను నేను కోల్పోయాను.. మోహన్‌బాబు.

ఎంతో గొప్ప వ్యక్తి.. మిమ్మల్ని చాలా మిస్సవుతాం.. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుండెపగిలిపోతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. రాధికా శరత్‌కుమార్‌.

ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను.. రజనీకాంత్.

ambarish

అంబరీశ్ ఇకలేరు. ఉదయాన్నే ఈ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. అల్లు అర్జున్‌.

అంబరీశ్‌ మరణవార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు.. ఖుష్బూ.

అంబరీశ్‌ సర్‌ ఇకలేరంటే నమ్మలేకపోతున్నాను. సుమలత గారికి, ఆమె కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి.. కల్యాణి ప్రియదర్శన్‌.‌

ambarish

ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆయన్ని పలుమార్లు కలిసినందుకు సంతోషంగా ఉంది. మరో లెజెండ్‌ వెళ్లిపోయారు.. రాయ్‌ లక్ష్మి.

అంబరీశ్‌ సర్‌ ఇంత త్వరగా వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ సర్‌.. ఈషా రెబ్బా.

మోహన్‌బాబు గారి ద్వారా పలు మార్లు అంబరీశ్‌ను కలిశాను. ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని ఓ స్టార్‌గా, మాస్‌ లీడర్‌గా, నిజమైన స్నేహితుడిగా ఎందరో అభిమానులు మిస్సవుతారు సర్‌.. బీవీఎస్‌ రవి.

tags: ambarish, kannada actor ambarish no more, kannada actor ambarish died, ambarish no more, rajinikanth about ambarish, chiranjeevi about ambarish

Related Post