కేసీఆర్ కు ఓ తాగుబోతు లేఖ

news02 June 5, 2019, 3:52 p.m. general

letter

క‌రీంన‌గ‌ర్ - మా వూరికి  నీళ్లు కావాలి.. లేదంటే మంచి రోడ్డు కావాలి.. ఓ మంచి ఆసుప్ర‌తికి కావాలి.. ఇవి ప్ర‌జా ప్ర‌తినిదిని ప్ర‌జలు  అడ‌గ‌టం మ‌నం చూశాం.. కాని ఓ ప్ర‌భుద్దుడి తన తాగుబోతు పైత్యం పీక్ చేరి ..ఏకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న "మందు" మెను ను ముందుంచారు. అవును.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఓట్ల లెక్కింపు సంద‌ర్బంగా.. జ‌గిత్యాల జిల్లాకు చెందిన .. ఓ వ్య‌క్తి బ్యాల‌ట్ బాక్స్ లో త‌న ఓటు తో పాటు.. ఓ లెట‌ర్ ను బాక్స్ లో వేసాడు. కేసీఆర్ కు ..ఆ వ్య‌క్తి  లేట‌ర్ లో ఇలా వ్రాసారు...
"సీఎం కేసిఆర్ గారికి వ్రాయునది ఏమనగా.. నేను జగిత్యాల జిల్లా వాసిని, మా జగిత్యాల జిల్లాలో  "కింగ్ ఫిషర్"(KF) బీర్లు దొరకడం లేదు. దాని వల్ల మా జిల్లా వాసులు వేరే జిల్లాలకు వెళ్ళి  మరి(KF) బీర్లు తాగుతున్నారు. కావున మా యందు దయతలచి మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచగలరు.
Note:
KingFisher బీర్ల కోసం మా జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయగలరు." అంటూ లెటర్ రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశారు. మొత్తానికి ఈ లెట‌ర్ ను చూసిన అధికారులు వీడి మాములు తాగు బోతు కాదురా బాబు అంటున్నారు.ఈ లెట‌ర్ ఇప్పుడు  సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అవుతుంది.

tags: letter, drinker wrote letter to kcr, heavy drinker wrote letter to cm kcr, a drinker drpo letter in ballet box, voter drop letter in ballot box, a drinker drop lettr to cm kcr in ballot box

Related Post