అసాంజేకు ఈక్వెడార్ షాక్

news02 July 30, 2018, 11:31 a.m. general

asange

లండన్‌: అగ్ర రాజ్యం అమెరికాకు కొర‌క‌రాని కొయ్య‌, ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు క‌నీసం అమెరికా వైపు క‌న్నెత్తి చూడ‌ని స‌మ‌యంలో... ఒకే ఒక్క‌డు ఆ దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన ఘ‌నుడు.. విజిల్ బ్లోయ‌ర్... జూలియ‌న్‌ అసాంజే. ఆస్ట్రేలియన్ సిటిజ‌న్ అయిన ఈయ‌న... అమెరికా భ‌ద్ర‌తకు సంబంధించిన ఎన్నో ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టి ఆ దేశానికి తీర‌ని న‌ష్ట‌మే చేశాడు. త‌న మాతృదేశం ఆస్ట్రేలియాలోనే ఉంటూ... అగ్ర రాజ్యంకు సంబంధించిన అనేక విష‌యాల‌ను త‌న వెబ్‌సైట్ వికీలీక్స్ ద్వారా బ‌హిర్గ‌తప‌రిచాడు. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్‌ తస్కరించిన అనేక‌మైన రహస్య పత్రాలను వీకీలీక్స్ ద్వారా వెలుగులోకి తెచ్చి సంచ‌ల‌నం సృష్టించాడు. 

asange

అయితే అమెరికాకు సంబంధించిన భ‌ద్ర‌త విష‌యాలు ఒక్క‌సారిగా ఇలా బ‌హిర్గ‌తం కావ‌డంతో... అగ్ర రాజ్యం భ‌గ్గుమంది.  ఈ నేప‌థ్యంలోనే అమెరికా అసాంజే అరెస్టు కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. అయితే ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన జూలియ‌స్.. త‌న సొంత దేశం ఆస్ట్రేలియా వ‌దిలి యూర‌ప్ వ‌చ్చేశాడు. మొద‌ట స్వీడ‌న్, త‌ర్వాత లండ‌న్ చేరుకున్నాడు. ఇక అగ్ర రాజ్యం అసాంజేను అదుపులోకి తీసుకోవాల‌ని బ్రిట‌న్‌పై అప్ప‌టి నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తూనే ఉంది. దీంతో అసాంజే త‌న‌ను అదుపులోకి తీసుకోకుండా లండ‌న్‌లోని ఈక్వెడార్ ఎంబ‌సీలో త‌ల‌దాచుకుంటున్న విష‌యం తెలిసిందే. రాయ‌బార కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఎంబ‌సీలోనే ఉంటూ పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నాడు. అంతేకాక అసాంజేను ప‌ట్టుకునేందుకు ఇంగ్లాడ్ స‌ర్కారు ఇప్ప‌టికే పెద్ద మొత్తంలో ఖ‌ర్చు కూడా చేసేయ‌డం విశేషం.  అందుకోసం ఈక్వెడార్ ఎంబ‌సీ ముందు త‌న బ‌ల‌గాల‌ను కాప‌లాగ పెట్టి నిఘా కూడా కొన‌సాగిస్తుంది. 

asange

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్న ఆ మ‌ధ్యే  ఈవిష‌యంలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌డం విశేషం. ఇన్ని రోజులు కంటికి రెప్ప‌లా ఆసాంజేను కాపాడుకున్న ఈక్వెడార్‌... ఆయ‌నను ఎంబ‌సీ నుంచి బ‌య‌ట‌కు పంపేందుకు ఒకే చెప్ప‌డం కొస‌మెరుపు. ఈ మేర‌కు ఈక్వెడార్‌ అధ్యక్షుడు లెనిన్‌ మొరెనో మొన్న ఓ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. 2012 నుంచి అసాంజేకు త‌న రాయ‌బార కార్యాల‌యంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తు న్న‌ట్లు... ఇక ఆయ‌న‌కు ఆశ్ర‌యం ఇచ్చే హోదాకు త్వ‌ర‌లోనే స్వ‌స్తి ప‌లుకుతామ‌ని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి చాలా సంవ‌త్స‌రాలుగా అటు ఇంగ్లాడ్ ప్ర‌భుత్వానికి... ఇటు అగ్ర‌రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన అసాంజే.... త్వ‌ర‌లోనే అమెరికా నిఘా వ‌ర్గాల చేతికి చిక్కే చాన్స్ క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జూలియ‌న్‌ విడుద‌ల చేసిన అమెరికా భ‌ద్ర‌త వివ‌రాల వెన‌క ఆయ‌నతో పాటు మ‌రెంత మంది ఉన్నార‌నేది మాత్రం... అసాంజేను అదుపులోకి తీసుకొని విచారించిన త‌ర్వాత మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

tags: julian assange,julian assange movie,julian assange citizenship,julian assange quotes,julian assange net worth,julian assange news, julian assange twitter,julian assange on modi,julian assange book,julian assange pamela anderson,julian assange wikileaks,julian assange age,julian assange amal clooney,julian assange autobiography,julian assange and daniel berg,julian assange and pamela,julian assange apartment,julian assange australia,julian assange adalah,julian assange alive,julian assange address,julian assange biography julian assange biography in hindi,julian assange benedict cumberbatch,julian assange bitcoin,julian assange birthday,julian assange biografia,julian assange born,julian assange bill hader,julian assange birth chart,julian assange b,julias orange ct,julian assange c julian assange daughter,julian assange dead,julian assange dancing,julian assange daniel,julian assange documentary youtube,julian assange daily mail,julian assange dob,julian assange diplomatic pouch,julian

Related Post