అండగా నేనుంటా..

news02 Sept. 9, 2018, 8:45 a.m. general

ntr

గత కొన్నేళ్లుగా నారా ఫ్యామిలీకి.. నందమూరి ఫ్యామిలీకున్న విభేదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. హరికృష్ణ మరణం తరువాత నారా-నందమూరి కుటుంబం మళ్లీ ఒక్కటవుతోంది. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే చొరవ చూపుతున్నారు. తమ బావమరిది హరికృష్ణ పాడెను స్వయంగా మోసి అందరిని ఆశ్చర్యంలో ముంచిన చంద్రబాబు ఇకపై నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలనుకుంటున్నారు. ముఖ్యమంగా తండ్రిని కోల్పోయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటున్నారు.

chandra babu

మీకు నేనున్నానంటూ వాళ్లిద్దరికి మామయ్య చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. హరికృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో ఈ విషయం స్పష్టమైంది. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. దిగులు పడవద్దని.. నాన్న లేని లోటు చీర్చలేనిదే అయినా.. అన్నింటికి అండగా తానుంటానని వారికి చేతిలో చెయ్యేసి మరీ చెప్పారు చంద్రబాబు. ఈ పరిణామాలతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

tags: babu, chandra babu, chandra babu naidu, chandra babu with ntr, chandra babu with jr ntr, chandra babu with kalyanaram, chandra babu with nandamuri family, chandra babu with junior ntr

Related Post