త్వరగా కోలుకోవాలని కోరుకుందాం..

news02 July 4, 2018, 9:01 p.m. general

sonali

న్యూయార్క్ (ఇంటర్నేషనల్ డెస్క్)- మణిరత్నం బొంబాయి సినిమా గుర్తుంది కదా... అందులో అద అరబి కడలందం పాటలో సూపర్ డ్యాన్స్ తో హొయలొలికించిన అందాల భామ సొనాలి బింద్రేకు క్యాన్సర్ అని తేలింది. చాలా కాలంగా ఒంట్లో నలతగా ఉంటే వైద్యపరీక్షలు చేయించగా క్యాన్సర్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా సొనాలి బింద్రేనే సోషల్ మీడియా ద్వార తెలిపింది. ఇక సొనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో క్యాన్సర్ కు వైద్యం చేయించుకుంటోంది. 

sonali bendre

సొనాలి బింద్రే చాలా తెలుగు సినిమాల్లో నచింటింది. మహేష్ బాబుతో మురారి, కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, తమిళ రీమేక్ ప్రేమికుల రోజు వంటి సినిమాలతో పాటు.. చాలా వరకు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తరువాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ సైతం చేసింది సొనాలి బింద్రే. తక్కువ సినిమాల్లో నటించినా ఇటు తెలుగులోను.. అటు హిందీలోను మంచి పేరు తెచ్చుకుంది. ఏదేమైనా సొనాలి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

sonali

tags: sonali, sonali bendre, sonali bendre suffering with cncer, sonali about cancer, sonali treatment in america, sonali diagnosis cancer

Related Post