ర‌వాణా శాఖ అటెండ‌ర్ అక్ర‌మాస్తులు 80 కోట్లు

news02 May 2, 2018, 11:17 a.m. general

acb rides
నెల్లూరు: అయ్యగారు చేసేది చిరుద్యోగ‌మే..అయితేనేం సంపాద‌న మాత్రం కోట్లే. చేసేది ర‌వాణా శాఖ‌లో అటెండ‌ర్ పోస్టే అయిన‌ప్ప‌టికీ కోట్ల రూపాయాల‌ను కూడ‌బెట్టాడు. ఉన్న‌త స్థాయి అధికారులు అవినీతికి పాల్ప‌డిన దొర‌క‌ని సోమ్ము ఈ అవినీతి అన‌కొండ ద‌గ్గ‌ర దొరికింది. ర‌వాణా శాఖ అటెండ‌ర్‌గా చేస్తున్న ఈ అన‌కొండ అక్ర‌మాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారుల‌కే క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. ఏళ్ల కొద్ది ఒకే పోస్టులో ఉండి కార్యాల‌యంపై ప‌ట్టు సాధించి పెద్ద ఎత్తున ఆస్తుల‌ను పోగేసుకున్నాడు. కార్యాల‌యానికి వ‌చ్చే ఉన్న‌తాధికారుల‌ను మ‌చ్చిక చేసుకొని భూములు, బంగారం,డ‌బ్బు, నివాస స్థ‌లాలు అక్ర‌మంగా సంపాదించాడు. చివ‌ర‌కు ఏసీబీ అధికారుల క‌న్ను ఇత‌నిపై ప‌డడంతో.. అక్ర‌మ ఆస్తుల పాపాల పుట్ట ఒక్క‌సారిగా ప‌గిలిపోయింది. అటెండ‌ర్ స్థాయిలో ప‌నిచేసే ఉద్యోగి వ‌ద్ద ల‌భ్య‌మైన ఆస్తుల వివ‌రాల‌ను చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. 

acb attacks

నెల్లూరు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో నరసింహారెడ్డి అటెండర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అక్టోబ‌ర్ 22 1984లో న‌ర్సింహారెడ్డి ఈఉద్యోగంలో చేరాడు. మామూలుగా కింది స్థాయిలో ప‌నిచేసిన ఉద్యోగికి ప‌దోన్న‌తి వ‌స్తే ఎగిరి గంతేస్తారు. సీనియార్టీతో పాటు ప్ర‌మోష‌న్ ల‌భిస్తే ఆనందం వ్య‌క్తం చేస్తారు. అయితే న‌ర్సింహారెడ్డి మాత్రం ప‌దోన్న‌తుల‌ను నిరాక‌రించాడు. అటెండ‌ర్‌గా చేరిన న‌ర్సింహారెడ్డికి ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు ప‌దోన్న‌తులు పొందే అవ‌కాశం ఉన్నా.. తీసుకోకుండా అటెండ‌ర్ ఉద్యోగాన్ని వెల‌గ‌బెడుతున్నాడు. ఈ అటెండ‌ర్ ఉద్యోగాన్ని న‌ర్సింహారెడ్డి అక్ర‌మ సంపాద‌న‌కు అడ్డంగా మార్చుకున్నాడు. స్థానికంగా ప‌ట్టు సాధించి, ఉన్న‌తాధికారుల‌ను మ‌చ్చిక చేసుకొని కోట్ల రూపాయాలు పోగేసుకున్నాడు. 

acb attacks 2

అటెండ‌ర్‌గా ప‌నిచేస్తున్న న‌ర్సింహారెడ్డిపై ఏసీబీ అధికారులు రైడ్ నిర్వ‌హించారు. అత‌ను ఇన్ని రోజులు సంపాదించిన ఆస్తుల వివ‌రాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట పెడుతున్నారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ప్ర‌కారం న‌ర్సింహారెడ్డికి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న‌ట్లు తేల్చారు. దాదాపు 80 కోట్ల విలువైన ప్రాప‌ర్టీస్ ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 50 ఎకరాల భూ ద‌స్తావేలు, 18 ఫ్లాట్లు, 2 కిలోల బంగారం, 7.5 లక్షల నగదును గుర్తించినట్లు తెలిపారు. నెల్లూరు,గుడిపాళెంల‌లో మ‌రికొన్ని ఆస్తులు ఉన్న‌ట్లు చెప్పారు. అయితే న‌ర్సింహారెడ్డి ఆస్తుల వివ‌రాలు చూసి ప్ర‌భుత్వ అధికారులే విస్తుపోతున్నారు. ఉన్న‌తాధికారులుగా ప‌ని చేసిన వారి వ‌ద్దే ఇంత మొత్తంలో ఆస్తులు  ఉండ‌వ‌ని... అలాంటిది అంటెండ‌ర్ స్థాయిలో ప‌నిచేసిన న‌ర్సింహారెడ్డి వ‌ద్ద ఈస్థాయిలో ఆస్తుల వివ‌రాలు బ‌హిర్గ‌తం అవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: acbrides,acb,narsimahareddy,nellor,rtooffice

Related Post