అమరుల ఆత్మశాంతి కోసం కాంగ్రెస్ ర్యాళి

news02 Feb. 22, 2019, 2:36 p.m. general

uttam

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడిలో వీర మరణం పొందిన జవాన్ల ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, వీ హనుమంతా రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు మరణించడం చాలా బాధకరమని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమరులకు ఘనంగా నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. అమరవీరులు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు ఉత్తమ్. ముక్తకంఠంతో రాజకీయాలకతీతంగా దాడిని ఖండిస్తూన్నామని అన్నారు. ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు కనీసం చనిపోయిన వారికి సానుభూతి కూడా ప్రకటించకపోవడం దారుణమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వీర మరణం పొందిన  సైనికుల ఆత్మకు శాంతి కలగాలి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అనేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. దేశ రక్షణ కోసం ఇప్పటికే మా నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కలిసికట్టుగా ఉగ్రవాదం పై పోరాడాలని పిలుపు ఇచ్చారని అన్నారు.

tags: uttam, pcc chief uttam, uttam about pulwama blast, uttam in rally, uttam kumar reddy, pcc chief uttam kumar reddy, uttam in pulwama jawans tribute

Related Post