స్కూల్ లో కాల్పులు.. 18 మంది మృతి

news02 Feb. 15, 2018, 9:17 a.m. general

ఇంటర్నేషనల్ డెస్క్ (వాషింగ్టన్)- అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌ లోని మర్జోరీ స్టోన్‌ మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ విధ్యార్ధి జరిపిన కాల్పుల్లో 18 మంది విద్యార్థులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ విధ్యార్ధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ క్రూజ్‌ గా పోలీసులు గుర్తించారు.  కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటున్నా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
ఇదే స్కూల్లో చ‌దువుతున్న నికోల‌స్‌ను కొద్దిరోజుల క్రితం యాజ‌మాన్యం స‌స్సెండ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. త‌న‌ను సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.  పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులకు తెగబడిన దుండగుడు.. అడ్డ‌కోవ‌డానికి ప్ర‌య‌త్నించిన టీచర్స్ ను  కాల్చేశాడు. ఆతరువాత పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జ‌రిగింద‌న్న ఆందోళ‌న‌తో అంద‌రూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే వేచి ఉన్న నికోల‌స్‌.. వారిపై విచ‌క్షణా ర‌హితంగా కాల్పులు జరిపాడు.  
ఇక ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Post