వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దు..

news02 Oct. 22, 2018, 11:11 p.m. general

rajinikanth

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్నివయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో కేరళ అట్టుడుకుతోంది. ఈ వివాదంపై దక్షిణాది సూపర్ స్తార్ రజినీకాంత్ మొదటిసారి స్పందించారు. మతం, సంప్రదాయాల విషయంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను స్త్రీ, పురుష సమానత్వాన్ని బలంగా సమర్థిస్తానని చెప్పిన రజనీ కాంత్.. సంప్రదాయాలను.. పద్దతులను కచ్చితంగా అనుసరించి గౌరవించాల్సిందేనని చెప్పారు. ఆధ్యాత్మిక విషయాల్లో నిక్కచ్చిగా ఉండే రజనీ కాంత్.. గత సంవత్సరం డిసెంబర్లో రాజకీయ అరంగేట్రం చేశారు.

rajinikanth
 
శబరిమల అయ్యప్ప ఆలయం అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడినా రజనీకాంత్ .. మహిళలకు సమాన హక్కులపై తనకు ఎలాంటి విరుద్ధ భావాలు లేవు... కాని ఆలయం విషయానికొస్తే... ఒక్కోదానికి ఒక విశ్వాసం, సంప్రదాయం ఉందని వ్యాఖ్యానించారు. చాలా సంవత్సరాలుగా అవే కొనసాగుతున్నాయని... వీటి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదన్నది నా విన్నపం... అని చెప్పుకొచ్చారు రజనీకాంత్. తాను  కోర్టు తీర్పుకు విరుద్దం కాదని చెప్పిన రజనీ కాంత్... సంబంధిత మతం, ఆచారాల విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

tags: rajinikanth, rajinikanth on sabarimala, rajinikanth about sabarimala, rajinikanth about sabarimala agitation, rajinikanth about ayyappa temple

Related Post