శ్రీదేవి డెత్ మిస్టరీ

news02 Feb. 26, 2018, 8:52 p.m. general

ఇంటర్నేషనల్ డెస్క్- దుబాయ్‌ లో మృతి చెందిన అతిలోక సుందరి శ్రీదేవి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికను దుబాయ్ వైద్యులు వెలువరించారు. ఈ నివేదికలోని అంశాలను యూఏఈ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఐతే శ్రీదేవి బాత్‌ టబ్‌లో పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారించింది.

Sridevi death mistory

ఈ నివేదిక ప్రకారం.. ఆమె శరీరంలో ఆల్కహాల్‌ నమూనాలు కూడా ఉన్నట్లు గల్ఫ్‌న్యూస్‌ స్పష్టం చేసింది. దీంతో శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందా.. లేక మరేదైనా కారణమా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు శ్రీదేవి పార్థివదేహాన్ని ఈ రోజు అర్ధరాత్రి తరువాతే ముంబయిలోని లోఖండ్‌ వాల్‌ లోని ఆమె నివాసానికి తరలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మహబూబ్‌ స్టూడియోలో అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారు.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళుల అనంతరం అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. పవన్‌ హన్స్‌ స్మశానవాటికలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ అభిమాన నటికి నివాళులర్పించేందుకు ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు ముంబయి చేరుకుంటున్నారు. 

Related Post