శ్రీదేవి మరణంపై దుబాయ్ లో హై డ్రామా..

news02 Feb. 27, 2018, 11:41 a.m. general

శ్రీదేవి డెత్ మిస్టరీకి సంబంధించి దుబాయ్ లో హై డ్రామా కొనసాగుతూనే ఉంది.  శ్రీదేవి భర్త బోనీకపూర్ ను .. కుటుంబసభ్యులను దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకూ బోనీని దుబాయ్ లో ఉండాల్సిందిగా పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బోనీని  పోలీసులు 18 గంటలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బోనీ పాస్ పోర్టు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీదేవి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు బోనీ నుంచి కేవలం సాక్షి వాంగ్మూలం మాత్రమే తీసుకున్నారని.. ఇంటరాగేట్ చేయలేదని దుబాయ్ మీడియాలో కథనాలు వచ్చాయి. శ్రీదేవి మరణం వెనుక కారణాలు తెలియాలంటే మరింత లోతుగా విచారణ జరపాలని దుబాయ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉంటే పెళ్లికి హాజరైన శ్రీదేవికి బోనీకపూర్ మొదటి భార్య బంధువులకు మధ్య ఆస్తులకు సంబంధించి పెద్ద గొడవ జరిగిందని తెలుస్తోంది.  పెళ్లిలో అందరూ కలిసి శ్రీదేవిని ఏకాకిని చేశారని .. పైకి సరదాగా డ్యాన్స్ లు చేస్తూ కనిపించిన శ్రీదేవి లోపల చాలా ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. పెళ్లిలో జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన శ్రీదేవి హోటల్ రూం నుంచి బయటకు రాలేదనే కథనాలు వినిపిస్తున్నాయి.  ఏది ఏమైనా అతి లోకసుందరి శ్రీదేవి మరణం ఒక పెద్ద మిస్టరీగా మారింది. దేశం కాని దేశంలో పోస్టుమార్టం రూంలో ఏకాకి అయ్యింది.  భారతదేశం మెచ్చిన సూపర్ స్టార్ శ్రీదేవి దుబాయ్ లో బాత్ టబ్ లో పడి మరణించిందన్న విషయాన్ని మాత్రం కోట్లాదిమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల సందేహాలకు ఎప్పటికీ తెరపడుతుందో వేచి చూడాలి.  

 

tags: sridevi, bonikapoor, death, mystery, disputes

Related Post