కర్నాటకలో ఘోర ప్రమాదం

news02 Nov. 24, 2018, 7:13 p.m. general

bus

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్య జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో మొత్తం 25 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా  పాఠశాల చిన్నారులే ఉండటం అందరిని కలిచివేసింది. కర్ణాటక మాండ్య జిల్లాలోని పాండవపుర నుంచి మాండ్య వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామ శివారులో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలోకి వెళ్లిన బస్సు వెంటనే నీటిలో మునిగిపోయింది. 

bus

ప్రయాణికులు బయటపడేందుకు అవకాశం లేకుండాపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో కొందరు ప్రయాణికులను రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారు. ఇక అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదం తరువాత బస్సు డ్రైవర్‌, కండక్టర్ కాలువలో ఈదుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. 

tags: bus, bus accident, bus accident in karnataka, bus accident in mandya, bus accident in mandya karnataka

Related Post