శ్రీదేవి చివ‌రి క్షణాల్లో అస‌లేం జ‌రిగింది

news02 Feb. 25, 2018, 1:35 p.m. general

బంధువుల ఇంట్లో పెళ్లి...సంతోషంగా కుటుంబం బ‌య‌లుదేరారు.. అంద‌రితో స‌ర‌దాగా గ‌డిపారు. ఫోటోలు తీసుకున్నారు. అంతోనే  విషాదం.. శ్రీదేవి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. ఆఘ మేఘాల మీద ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందేంత లోపే... శ్రీదేవి అంద‌ని లోకాల‌కు వెళ్లిపోయారు. అంతా క్ష‌ణాల్లో జ‌రిగింది..శ్రీదేవి చివ‌రి క్ష‌ణాల్లో అస‌లు ఏం జ‌రిగింది?

శ్రీదేవి భ‌ర్త బోనీక‌పూర్, కూతురు ఖుషితో క‌లిసి బంధువుల పెళ్లికి దుబాయ్ వెళ్లారు. పెద్ద కుమార్తె జాన్వికి షూటింగ్ ఉండ‌టంతో పెళ్లికి హాజ‌రుకాలేద‌ని తెలుస్తోంది. పెళ్లిలో చ‌లాకీగా తిరుగుతూ శ్రీదేవి సంద‌డి చేశారు. ఫంక్ష‌న్ పూర్తికాగానే హోట‌ల్ గ‌దికి చేరుకున్నారు. భ‌ర్త‌, కుమార్తెతో మాట్లాడుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలి స్పృహ కోల్పోయారు. కుటుంబ‌స‌భ్యులు హుటాహుటీన ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ .. కార్డియాక్ అరెస్ట్ తో శ్రీదేవి అప్ప‌టికే క‌న్నుమూసిన‌ట్లు ఆసుప‌త్రి వైద్యులు ధృవీక‌రించారు. శ్రీదేవికి అంత‌కు ముందు ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు లేవు.. కానీ గుండెపోటు మొద‌టిసారి  వ‌స్తూనే తీవ్రంగా రావ‌డంతో ఆమె క‌న్నుమూసిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. 

tags: sridevi, cardiacarrest, death, actress, bollywood

Related Post