పోలీసుల‌కు నిజంగా చ‌ల్ల‌ని కబురే..

news02 June 14, 2019, 11:18 a.m. general

ac_helmets_for_traffic_police

ఛ‌త్తీస్ ఘ‌డ్ : ఎండ‌లో వెళ్ళాలంటే.. మ‌నం త‌ల్ల‌డిల్లి పోతాం.. త‌ప్పనిస‌రి అయితే.. గొడుగు.. ఇంకా దూరం వెల్లాల్సి వ‌స్తే.. ఏసీ వాహ‌నం ఉండాల్సిందే. మ‌రి నిత్యం రొడ్డుపై విధుల నిర్వ‌హించే ట్రాఫిక్ పోలిసుల సంగ‌తేంటీ.?  గంటల తరబడి నిల్చోని... ఎండకు ఎండుతూ., వానకు తడస్తూ... పైగా తీవ్రమైన పొల్యూషన్. ఇక సమ్మర్ లో ఈ ట్రిఫిక్ పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అంతేకాదు అదే రొడ్డుపై ట్రాఫిక్ నిబంధ‌న‌లను ప‌ట్టించుకోకుండా మ‌నలో చాలా మంది వెళ్తుంటాం. కాని.. అదే మండే ఎండ‌లో  కూడా విధులు నిర్వ‌హిస్తున్న‌ ట్రాఫిక్ పోలీస్ గురించి మాత్రం అలోచించం. కాని ఛ‌త్తిస్ ఘ‌డ్ ప్ర‌భుత్వం వినూత్నంగా లోచించింది. మండే ఎండ‌లో విధులు నిర్వ‌హించే  ట్రాఫిక్ పోలీసులకు కూల్ న్యూస్ అందించింది...అవును మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇవ్వాలని నిర్ణయించింది ఛ‌త్తిస్ ఘ‌డ్ స‌ర్కార్. చిప్‌, బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ  రెండు రకాల ఏసీ హెల్మెట్ల ట్రాఫిక్ పోలీసుల‌కు ఇవ్వాల‌ని నిర్ణియంచింది. దీంతో క్షేత్ర‌ స్తాయిలో విధులు నిర్వ‌హించే సిబ్బందికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ..అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చ‌త్తిస్ గ‌డ్ డిజిపీ అవ‌స్థీ అంటున్నారు. 

traffice,/traffic_plolice, vehicles, road

త‌మ రాష్ట్రంలో 10వేల మంది పోలీసులు మండు టెండల్లో పని చేస్తున్నారని .. పెరిగిపోతున్న ఎండ వేడిమి కారణంగా సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారని.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని డీజీపీ వాపోయారు. సిబ్బంది సంక్షేమం, వారి బాగోగులు తమ బాధ్యత గా భావించే ఏసీ హెల్మెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఛ‌త్తీస్ ఘ‌డ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంశ‌లు కురుస్తున్నాయి. ఇలా ప్ర‌తి రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల క‌ష్టాలు ఒక్క‌టే కాబ‌ట్టి.. అన్ని ప్ర‌భుత్వాలు ఎండ‌లో ప‌నిచేసిఏ సిడ్డందికి.. ఏసీ హెల్మెట్ లు ఇవ్వాల‌ని సూచిస్తున్నారు. ఇక ఇప్ప‌డికే.. పోలీసు ఉన్న‌తాధికారుల‌కు  ఏసీ ఇన్నోవా వాహ‌నాల‌ను ఇచ్చి మొద‌టి వ‌ర‌స‌లో నిలిచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఇక క్షేత్ర స్తాయి   
ట్రాఫిక్ పోలీసులకు కూడా  ఏసీ హెల్మెట్ ల‌ను ఇచ్చి మేలు చేస్తే బాగుంటుంది కదూ.. 

tags: chatthish ghadh govermant, dgp avasthi, traffic plice, ac helmets, summer , road, telanga police,

Related Post