తల్లిదండ్రుల సంరక్షణ పిల్లలదే

news02 May 13, 2018, 7:28 a.m. general

Parents harassment

ఢిల్లీ : చిన్నప్పుడు కష్టపడి పెంచి పెద్ద చేస్తే.. పెళ్లి కాగానే తల్లి దండ్రులను పట్టించుకుంటున్న వాళ్ళు ఎంత మంది ఉంటున్నారు. రెక్కలు రాగానే ఎగిరిపోయే పక్షులుగా తల్లిదండ్రులను వదిలేసి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. రోజు వారీ కూలి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు సొంత తల్లి దండ్రులను రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో తల్లి దండ్రులను పట్టించుకోని వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేవిదంగా కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది.

Parents act bill

బాధ్యులు అంటే కన్న కొడుకులే కాదు. కోడళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనమరాళ్లు, దత్తత కొడుకులు, పెంచుకున్న కొడుకులు, సవితి కొడుకులు, బిడ్డలు ఇలా అందరిని బాధ్యులు చేసేవిధంగా చట్టాన్ని రూపొందిస్తున్నారు. తల్లిదండ్రుల సంక్షేమం, ఆరోగ్యం పట్టించుకోకపోవడం పాటు వాళ్లను ఆస్తులకోసం వేధించినా జైలుకు పంపే విధంగా కఠినంగా చట్టాన్ని రూపొందిస్తోంది కేంద్రం. ఇందుకు మైనర్ పిల్లలు కూడా మినహాయింపు కాదు.

Parents care bill

కుటుంబంలోని ఆదయవ్యయాలను బట్టి తల్లిదండ్రుల సంరక్షణకు ఎంత ఇవ్వలనేది డిసైడ్ చేస్తుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 6 నెలల జైలు శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరికైనా ఆ అన్యాయం జరిగితే మెయింటెనెన్సు కోర్ట్ ను ఆశ్రయించవచ్చు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

tags: Parent care, parents harassment, parent act bill, old age homes, new bill, parlament, rain session, pm modi, bjp government .

Related Post