తుది శ్వాస విడిచిన అంబరీష్

news02 Nov. 25, 2018, 12:46 p.m. general

ambarish

ప్రముఖ నటుడు అంబరీష్ ఇక లేరు. కన్నడ సినీరంగంలో రెబల్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అంబరీష్‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంబరీష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే అంబరీష్‌ తుదిశ్వాస విడిచారు. అంబరీష్ మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి తదితర ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబరీష్ కు భార్య సుమలత, కుమారుడు అభిషేక్‌ ఉన్నారు. 1952 మే 29న మైసూర్ రాష్ట్రం మాండ్యలో జన్మించిన అంబరీష్‌ కన్నడ సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 

ambarish

మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని దొడ్డఅరసికెరె గ్రామానికి చెందిన అంబరీష్‌ రాజకీయాల్లోనూ రాణించారు. లోక్‌సభ సభ్యుడిగా, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా, సిద్దరామయ్య మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. అంబరీష్ భార్య సుమలత కూడా ప్రముఖ నటి. ఇటు తెలుగు, కన్నడ సహా వివిధ భాషల్లోని సినిమాల్లో అంబరీష్, సుమలత కలిసి నటించారు. అంబరీష్ మరణంతో ఆయన అభిమానలు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి పాటు సినీ రంగానికి చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

tags: ambarish, actor ambarish, ambarish no more, ambarish died, ambarish death, actor ambarish no more, ambarish fenoral

Related Post