గృహ కొనుగోలుదారులకు చేరువగా ఎస్.బీ. ఐ

news02 June 13, 2019, 11:26 a.m. general

Sbi

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా వినూత్నమైన సేవలతో కస్టమర్ల ముందుకు వచ్చింది. గృహ కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. వీరి కోసం ప్రత్యేకమైన గమ్య స్థానాన్ని ఏర్పాటు చేసింది. దీని పేరు డెస్టినేషన్ ద హోమ్ షాపీ. హైటెక్ సిటీలోని ఐకియా స్టోర్‌కు ఇది సమీపంలో ఏర్పాటైంది.

Sbi

ఎస్‌బీఐ హోమ్ షాపీలో బ్యాంక్.. నివాస ప్రాజెక్టుల వివరాలను, ఇతర సమాచారాన్ని డిజిటల్ రూపంలో కస్టమర్లకు డిస్‌ప్లే చేస్తుంది. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఎస్‌బీఐ ఆమోదం ఉంటుంది. దీంతో బిల్డర్, కస్టమర్, బ్యాంక్ మూడు ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చినట్లు అయ్యింది. 12 బిల్డర్లు ఇందులో భాగస్వామ్యమై ఉన్నారు. 17 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.

Sbi

ఇల్లు కొందామని భావించేవారు.. నేరుగా ఎస్‌బీఐ హోమ్ షాపీకి వెళ్లొచ్చు. అక్కడ నచ్చిన ప్రాజెక్ట్‌ను ఎంచుకొని, కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే యోనో యాప్ ద్వారానే హోమ్ లోన్స్‌కు సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చని బ్యాంక్ తెలియజేసింది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

tags: SBI,SBH,ANDRA BANK,ICICI BANK, BANKING, BANKS,BANK ACCOUNT, HYDERABAD

Related Post