అమాయ‌కుడిపై దాడి.. సెల్ఫీలు తీసుకున్న జ‌నం

news02 Feb. 23, 2018, 3:13 p.m. general

సెల్ఫీ మోజులో కొంద‌రు మాన‌వ‌త్వం మ‌ర్చిపోతున్నారు. చుట్టూ జ‌రుగుతున్న దారుణాల్ని ఆపాల‌నే చిన్న ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా.. సెల్ఫీలు దిగుతున్నారు. మ‌తిస్థిమితం లేని ఓ యువ‌కుడు దొంగ‌త‌నం చేశాడ‌న్న నెపంతో జ‌నం క‌ట్టేసికొడుతుంటే ఆపాల్సింది పోయిన యువ‌కులు ఇదేమీ ప‌ట్ట‌న‌ట్లు  సెల్ఫీలు దిగారు. ఈ అమానుష ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. మాన‌సిక స్థిమితం కోల్పోయిన ఓ యువ‌కుడు షాపుల‌లో వ‌స్తువుల్ని దొంగిలించాడ‌ని కొంద‌రు గ్రామ‌స్తులు అత‌డిని నిర్బంధించారు. అంత‌టితో ఆగ‌కుండా కొన్ని గంట‌ల‌పాటు కొడుతూ చిత్ర‌హింస‌లు పెట్టారు. ఓవైపు గ్రామ‌స్తులు అత‌నిపై దాడి చేస్తుంటే మ‌రోవైపు కొంద‌రు యువ‌కులు ఇదేమీ ప‌ట్ట‌నట్లు ఎదురుగా నిల‌బ‌డి సెల్ఫీలు దిగారు. ఈలోపు కొంద‌రు స్ధానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాల‌తో ఉన్న బాధితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆ యువ‌కుడు చ‌నిపోయాడు. అయితే అత‌నిది స‌హ‌జ మ‌ర‌ణ‌మా .. లేక స్ధానికులు కొట్టిన దెబ్బ‌ల‌కు చ‌నిపోయాడా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు కేర‌ళ‌లో కొంత‌కాలంగా అమాయ‌క ప్ర‌జ‌ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. 

tags: kerala, beating, selfie, youth, hitting

Related Post