టేకాఫ్ తీసుకున్న భారీ విమానం

news02 April 15, 2019, 8:52 a.m. general

world biggest flight

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్‌ గాల్లోకి ఎగిరింది.  ప్రయోగాత్మక పరీక్షల్లో భాగంగా శనివారం ఈ భారీ విమానం తొలిసారి ఆకాశంలోకి ఎగిరింది. 2 లక్షల 26 వేల 800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు 117మీటర్లు. అంటే సుమారు ఓ ఫుట్‌ బాల్ గ్రౌండ్‌ పొడవుతో సమానమన్న మాట. అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే ఎయిర్ పోర్ట్ నుంచి అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్‌ తొలి టేకాఫ్ తీసుకుంది. గంటకు 304 కిలోమీటర్ల వేగంతో ఎగిరిన ఈ విమానం సుమారు 17వేల అడుగుల ఎత్తులో సక్సెస్ ఫుల్ గా ప్రయాణించింది. గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి తద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఈ విమానం తయారీ లక్ష్యమన్న మాట. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది. మరికొన్ని పరీక్షల అనంతరం పూర్తి స్థాయి వినియోగానికి స్ట్రాటోలాంచ్‌ విమానానికి పూర్తి అనుమతులు లభించనున్నాయి.

tags: statolaunch, statolaunch flight, statolaunch flight take off, world biggest flight, statolaunch flight world big , world big flight statolaunch

Related Post