అమెరికా మాజీ అధ్యక్షులు బుష్ ఇక లేరు

news02 Dec. 1, 2018, 7:44 p.m. general

bush

అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ ఇక లేరు. అమెరికాకు 41వ అధ్యక్షుడుగా పనిచేసిన బుష్ 94ఏళ్ల వయసులో కాసేపటి క్రితం చనిపోయారు. జార్జ్ బుష్ చనిపోయినట్లు ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జ్‌ డబ్ల్యు బుష్‌ తెలిపారు. తన తండ్రి ఇకలేరు అని చెప్పడం ఎంతగానో బాధిస్తోందని ఆయన అన్నారు. తన తండ్రి జార్జ్ బుష్ ది అత్యంత ఉత్తమమైన వ్యక్తిత్వమని, ఆయన అత్యంత ఉత్తమమైన తండ్రి అని చెప్పారు. తన తండ్రి మృతితో తమ కుటుంబం విషాదంతో నిండిపోయిందని జార్జ్ బుష్ తెలిపారు. జార్జ్ బుష్‌ సతీమణి బార్బరా బుష్‌ చనిపోయిన కొన్ని నెలల్లోనే బుష్ కూడా చనిపోయారు. 

bush

ఇక సీనియర్ జార్జ్ బుష్‌కు మొత్తం ఐదు మంది పిల్లలు, 17 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.అమెరికా రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన హెచ్ డబ్ల్యూ బుష్‌ 1989 నుంచి 1993 వరకు అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఐతే అంతకు ముందు 1981 నుంచి 1989 వరకు జార్జ్ బుష్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కోల్డ్‌వార్ చివరలో అమెరికాను ముందుకు నడిపించడంలో బుష్‌ సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చుజార్జ్ బుష్ ను అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్తగా చెబుతుంటారు. 1992 ఎన్నికల్లో జార్జ్ బుష్‌ డెమోక్రాట్‌ నేత బిల్‌ క్లింటన్‌పై ఓటమిపాలయ్యారు. జార్జ్ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ను ఎక్కువగా బుష్‌ 41 అని, జార్జ్‌ బుష్‌ సీనియర్ అని పిలుస్తుంటారు. బుష్‌ పెద్ద కుమారుడి పేరు కూడా జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అయినందున ఇద్దరిని పిలవడంలో ఇబ్బందని ఇలా పిలుచుకుంటారు.

 

tags: george w bush, george w bush died, george w bush no more, us former president george w bush no more, america former president george w bush died

Related Post