పుల్వామా దాడికి ప్రతీకారం

news02 Feb. 18, 2019, 7:18 p.m. general

rashid

జమ్మూ కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రదాడికి పాల్పడి 40 మందిని పొట్టనపెట్టుకున్నజైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు అంతమొందించాయి. ఈ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని మట్టుపెట్టారు. ఐతే ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు చనిపోయారు. 

terrorist rashid

పుల్వామా ఉగ్రదాకి ప్రధాన సూత్రదారుడు జైషే సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అని భద్రతా దళాలు నిర్ధారణకు వచ్చాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌ దార్‌కు ట్రైనింగ్ ఇచ్చింది కూడా అబ్దుల్‌ రషీద్‌ ఘాజీనే. రషీద్‌ జైషే మహమ్మద్‌ సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు నమ్మిన బంటు. ఘాజీ ఐఈడీ ఆత్మాహుతి బాంబులు తయారు చేయడంలో దిట్ట. పుల్వామా దాడికి సంబందించి అదిల్‌ దార్‌కు ఈ విషయంలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని కశ్మీర్‌కు మసూద్‌ అజరే పంపాడని తెలుస్తోంది.

tags: pulwama, pulwama terrorist encounter, pulwama terrorist rashid encounter, terrorist rashid encounter

Related Post