మలాలా కోసం షారుక్ ఖాన్..

news02 Oct. 9, 2018, 8:51 a.m. general

malala

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ కోరికను నెరవేర్చబోతున్నారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. తాను చదువుతున్న వర్సిటీకి షారుక్ ఖాన్ రావాలని మలాలా ఎప్పుటి నుంచో కోరుకుంటోంది. ఎట్టకేలకు మలాలా విన్నపానికి షారుఖ్ అంగీకరించారు. ప్రస్తుతం మలాలా ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లేడీ మార్గరేట్ హాల్ లో డదువుకుంటోంది. ఈ కళాశాల ప్రిన్సిపల్ అలాన్ రుస్ బ్రెడ్గర్ ఈ మేరకు షారుక్ కు ట్విట్టర్ లో విన్నవించడంతో అందుకు ఆయన అంగీకరించారు. 

sharukh

తమ వర్సిటీలోని మలాలాతో పాటు విధ్యార్ధులందరికి షారుక్ అంటే ఇష్టమని ఆయన ట్వీట్ చేయడంతో షారుక్ వెంటనే స్పందించారు. ఇక వర్సిటీ ప్రిన్సిపల్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన మలాలా.. షారుక్ కోసం మేము ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేసింది. ఇందుకు స్పందించిన షారుక్.. విద్యార్ధులతో మాట్లాడటం తనకూ ఇష్టమేనని.. వారితో సమావేశం కావడం తనకూ గర్వకారణమని పేర్కొన్నారు. మలాలాతో సహా విధ్యార్ధులను కలవడానికి త్వరలోనే వస్తానని ట్వీట్ చేశారు షారుక్. దీంతో చాలా కాలంగా షారుక్ ను కలవాలన్న తన కోరిక తీరనుందని మలాలా ఆనందం వ్యక్తం చేస్తోంది.

tags: malala, malala wants meet sharukh, sharukh khan, sharukh khan about malala, malala about sharukh, sharukh will meet malala

Related Post