అబ్బే అది అక్కడ కాదు..

news02 Oct. 17, 2018, 7:39 a.m. general

sudha

సుధాచంద్రన్ గుర్తుంది కదా.. అదే నండీ ప్రఖ్యాత భరతనాట్య గత్తె. గతంలో తిరుచ్చిలో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకున్నప్పటికీ.. కృతిమ కాళ్లతోనే నృత్యం మీద తనకున్న ఇష్టాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. అన్నట్టు తెలుగులో మయూరి పేరుతో తీసిన తన బయోపిక్ సినిమాలో తనే నటించి అందరిని మెప్పించింది. సరే ఇప్పుడామె గురించి ఎందుకు చెబుతున్నామంనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. సుధా చంద్రన్ శవరిమల వివాదంలో చిక్కుకుందన్నమాట. శబరిమల అయ్యప్ప దేవాలయ సన్నిధిలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలంటూ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై కేరళతో పాటు దేశమంతా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తీర్పు సనాతన ధర్మాల్ని, అయ్యప్ప సన్నిధి ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా వుందంటూ నిరసనలు వెల్లువెత్తాయి. 

sudha

మహిళలు గుడిలోకి ప్రవేశిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని శివసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇదిగో ఇటివంటి సమయంలో మధ్య వయసు మహిళలు అయ్యప్ప సన్నిధిలో భక్తి పారవశ్యంతో డ్యాన్సులాడొచ్చా అని ప్రశ్నిస్తూ.. నర్తకి సుధాచంద్రన్‌కి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. శబరిమల అయ్యప్ప సన్నిధి దగ్గర 18 పడిమెట్ల ఎదురుగా సుధా చంద్రన్ నృత్యం చేస్తున్నప్పటి దృశ్యం వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1986లో తీసిన నంబినార్ కెడువదిల్లై అనే తమిళ్ సినిమాలోని డ్యాన్స్ ఇది. ఐతే ఇది శబరిమలలో తీసింది కాదని.. ఒక స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించిందని సుధా చంద్రన్ చెబుతోంది. ఐతే వీడియోను నిశింతగా పరిశీలిస్తే.. అది అయ్యప్ప సన్నిధిలోనే షూట్ చేసిని అనిపిస్తోంది. ఇంకేముంది సినిమా షూటింగులకైతే మహిళలకు అయ్యప్ప గుడిలోకి అనుమతిస్తారా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. 

tags: sudha, sudha chandran, sudha chandran dance, sudha chandran dance in sabarimala, sudha chandran dance in ayyappa temple, sudha chandran dance at sabarimala

Related Post