విజ‌య‌వాడ మ‌హిళా సెష‌న్స్ కోర్టు తీర్పు

news02 June 14, 2018, 4:04 p.m. general

naga vaishnavi murder case
విజ‌యవాడ: సంచ‌ల‌నం సృష్టించిన నాగ‌వైష్ణ‌వి హ‌త్య కేసులో తుది తీర్పు వెలువ‌డింది. నాగ‌వైష్ణ‌విని హ‌త్య చేసినందుకు ముగ్గురు నిందితుల‌కు విజ‌య‌వాడ మ‌హిళా సెష‌న్స్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. సుదీర్ఘ విచార‌ణ చేసిన అనంత‌రం గురువారం కోర్టు ఈతీర్పునిచ్చింది. దాదాపు 8 ఏళ్ల పాటు కొన‌సాగిన విచార‌ణ‌లో...మొత్తం 79 మంది సాక్షుల‌ను సెష‌న్స్ కోర్టు విచారించింది. చివ‌ర‌కు నాగ‌వైష్ణ‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు వెంటకరావు గౌడ్ ను ప్ర‌ధాన నిందితుడుగా తేల్చింది. అత‌నితో పాటు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌ల‌ను నిందితులుగా తేల్చిన కోర్టు మొత్తం ముగ్గురికి జీవిత కారాగారం విధించింది. అయితే నిందితులు ఉన్న‌త న్యాయ‌స్థానంలో అప్పీలు చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. 

naga vaishnavi family

అంతులేని విషాదం
2010లో నాగ‌వైష్ణవి హత్యకు గురికావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా... గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను అడ్డ‌గించి..కిడ్నాప్ చేశారు. అడ్డు వ‌చ్చిన డ్రైవ‌ర్‌నూ హ‌త‌మార్చారు. అయితే ఈకేసు ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్‌లో సంచ‌నంగా మార‌డంతో...పోలీసులు నాగ‌వైష్ణ‌వి కోసం రెండు రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివ‌ర‌కు ఆమె గుంటూరు ప‌రిస‌రాల్లోని ఆటోనగర్‌లో ప్లాట్ నెంబరు 445లో శవ‌మై క‌నిపించింది. 

nagavaishnavi with her father

అయితే నాగ‌వైష్ణ‌వి మృతి చెందిన విష‌యాన్ని త‌ట్టుకోలేని ఆమె తండ్రి ప్ర‌భాక‌ర్ గుండెపోటు మృతిచెందాడు. కొద్దిరోజుల‌కు ఆమె త‌ల్లి కూడా త‌నువు చాలించింది. అయితే ఈకేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు...ప్ర‌భాక‌ర్‌ మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడే ప్ర‌ధాన నిందితుడ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు. ఆయ‌న‌కు మ‌రో ఇద్ద‌రు నిందితులు  మెర్ల శ్రీ‌నివాస‌రావు, వెంప‌రాల జ‌గ‌దీష్ స‌హ‌క‌రించిన‌ట్లు క‌నుగొన్నారు. ఆస్తి కోస‌మే ఈదారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిపై ఐపీసీ 302, 367, 420, 201, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ స‌బ్మిట్ చేశారు. అయితే ఈకేసు దాదాపు 8 ఏళ్లు సుదీర్ఘ విచార‌ణ కొన‌సాగి...గురువారం తీర్పు వెల్ల‌డి కావ‌డం విశేషం. 

nagavaishna murder afenders

మ‌రోవైపు నాగ‌వైష్ణ‌వి హ‌త్య కేసులో నిందితుల‌కు జీవిత్ ఖైదు ప‌డ‌డాన్ని ప్ర‌జా సంఘాలు, ఆమె బంధువులు హ‌ర్షిస్తున్నారు. మున్ముందు మ‌రెవ్వ‌రూ ఇలాంటీ సాహ‌సానికి ఒడిగ‌ట్ట‌కుండా...నాగ‌వైష్ణ‌వి హ‌త్య కేసులో ఇచ్చిన తీర్పు గుణ‌పాఠంగా మారుతుందంటున్నారు. 

nagavaishnavi
 

tags: judgement on naga vaishnavi murder casse,vijavada sessions court,prabhakar rao,srinivas,pandi venkateshvar rao,high court

Related Post