ఫుల్ గా తాగి పోలీసుల‌కు దొరికి ర‌చ్చ‌ర‌చ్చ చేసిన యువ‌తులు

news02 May 12, 2018, 5:24 p.m. general

druned girls

హైద‌రాబాద్: హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి మ‌ద్యం సేవించిన యువ‌తులు పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డి స‌తాయిస్తున్నారు. మ‌ద్యం ప‌ర్సెంటేజి  కోసం చేసే ప‌రీక్ష‌ల‌కు స‌సేమీరా అంటున్నారు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు బార్లు, ప‌బ్బుల్లో ఎంజాయి చేస్తున్నారు. ప‌బ్బుల్లో ఫుల్‌గా తాగిన త‌ర్వాత రోడ్ల‌పై హంగామా సృష్టిస్తున్నారు. 


శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు యువ‌తులు ఫుల్‌గా మ‌ద్యం సేవించి జూబ్లీహీల్స్ చెక్‌పోస్టు వైపు కారులో వ‌చ్చారు.  అయితే అక్క‌డే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు వీరు ప‌ట్టుబ‌డ్డారు.బ్రీత్ ఎన‌లైజ‌ర్ తో ప‌రీక్ష‌లు చేసేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌తో గొడ‌వ‌రు దిగారు. మ‌హిళా కానిస్టేబుల్స్ ఎక్క‌డున్నారు..  వాళ్ళు వ‌స్తేనే ప‌రీక్ష‌లు చేయించుకుంటామ‌ని బీష్మించుకు కూర్చున్నారు. అర‌గంట త‌ర్వాత వ‌చ్చిన మ‌హిళా కానిస్టేబుల్ల‌తో ప‌రీక్ష చేయిస్తే డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న యువ‌తి 80 శాతం ఆల్క‌హాల్ తాగిన‌ట్లు తేలింది. ప‌క్క సీట్లో కూర్చున్న యువ‌తికూడా మ‌ధ్యం స్వీక‌రించిన‌ట్లు పోలీసులు ప‌రీక్ష‌లో తేలింది.  ఇద్ద‌రు యువ‌తులు అస‌లు స్పృహ‌లో లేన‌ట్లు గుర్తించారు. 

హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం రాత్రి 4 చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వ‌హించారు. కేబీఆర్ పార్కు, బంజారాహిల్స్‌, జూబ్లీహీల్స్ చెక్‌పోస్టు, డైమండ్ హౌజ్ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌ట్టారు. ఇందులో 96 వాహ‌నాల‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో 57 కార్లు, 39 బైకులున్నాయి. 94 మంది పురుషులు, ఇద్ద‌రు అమ్మాయిల‌పై కేసులు న‌మోదు చేశారు. 

tags: drunked girls, hyderabad police, drunk and drive, hyderabad girls, hyderabad pubs, pub girls, jubllihills.

Related Post