సాయి తేజ కు రాహూల్ శుభాకాంక్షలు

news02 Feb. 10, 2019, 7:57 a.m. general

rahul

సాయితేజ జీ.. మీది స్ఫూర్తినిచ్చే గాథ.. ఇది మీలో దాగి ఉన్న ప్రతిభను తెలియజేస్తోంది.. దానిని కొనసాగించండి.. ఆల్‌ ది బెస్ట్‌.. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడిని ఉద్దేశించి ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి చెప్పిన మాటలివి. హైదరాబాద్ కు చెందిన పదవ తరగతి చదివిన సాయితేజ.. మధ్యం తాగి వాహనం నడిపితే ఇంజిన్ స్టార్ట్ కాకుండా ఉండే ప్రత్యేకమైన పరికరాన్ని రూపొందించాడు. డ్రైవర్ మధ్యం తాగి వాహనం నడిపితే సంబందిత ఫోన్లకు మెస్సేజ్ సైతం వెళ్తుంది. ఈ విషయాన్ని మీడియాలో చూసిన రాహూల్ గాంధీ ఈ పరికరణాన్ని రూపొందించిన సాయి తేజను అభినందించారు. సాయితేజ జీ.. యువర్స్‌ ఈజ్‌ యాన్‌ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు రాహూల్ గాంధి. సాయి తేజ ఫోటోను స్వయంగా ఫేస్ బుక్ లో పోస్టూ చేస్తూ అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు ఏఐసిసి అధ్యక్షులు.

tags: rahul, saiteja, rahul compliments to sai teja, rahul gandhi compliments to sai teja, rahul complimented sai teja

Related Post