యాపిల్ కు 500 డాలర్ల జరిమానా..

news02 April 24, 2018, 3:16 p.m. general

delta airliness fine

అమెరికా-పారిస్ (ఇంటర్నేషనల్ డెస్క్)- అమెరికాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో తినడానికి స్నాక్స్‌గా ఇచ్చిన యాపిల్‌ను తినకుండా బ్యాగులో పెట్టుకుని వచ్చినందుకు ఓ మహిళకు 500డాలర్ల జరిమానా విధించింది సదరు వినమాయాన సంస్థ. అమెరికాలోని కొలరాడోకు చెందిన క్రిస్టల్‌ టెడ్‌ లాక్‌ పారిస్‌కు వెళ్లి... తిరుగు ప్రయాణంలో పారిస్‌ నుంచి డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానంలో అమెరికాలోని మిన్నెపోలిస్‌కు వచ్చింది. ప్రయాణంలో డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానంలో స్నాక్స్‌ గా తినడానికి యాపిల్‌ను ఇచ్చారు సిబ్బంది. అయితే ఆమె దాన్ని తినకుండా బ్యాగులో పెట్టుకుంది. సదరు మహిళ మిన్నెపోలిస్‌ నుంచి కొలరాడోలోని డెన్వర్‌ కు వెళ్లనుండటంతో.. తర్వాతి ఫ్లైట్‌ లో ఆకలేస్తే తినొచ్చు అనుకుందట..

ఇంతవరకు బాగానే ఉన్నా.. మహిళ మిన్నెపోలిస్‌ లో దిగగానే కస్టమ్స్‌ అధికారులు బ్యాగులు చెక్‌ చేశారు. క్రిస్టల్‌ బ్యాగులో డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన కవర్‌ లో యాపిల్‌ ఉండటంతో అధికారులు దాన్ని బయటకు తీసి అనుమతి లేకుండా యాపిల్‌ ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. విమానంలో తినడానికి స్నాక్స్‌ గా ఇచ్చారని ఆమె చెప్పినా.. అధికారులు ఆమెకు  500డాలర్ల జరిమానా విధించారు. తెలియక చేసిన తప్పుకు పెద్ద మొత్తంలో జరిమానా పడిందని క్రిస్టల్ ఆవేధన వ్యక్తం చేసింది. విమానంలో యాపిల్‌ ఇవ్వకుండా ఉండాల్సిందని, లేదంటే యాపిల్‌ ను విమానం నుంచి బయటకు తీసుకెళ్లద్దని ముందే చెప్తే బాగుండేదని ఆమె అన్నారు.

Related Post