ప్రకాష్ రాజ్ తో ఫోటో దిగుతున్న భార్యను

news02 June 15, 2019, 8:53 p.m. general

prakash raj

 

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రకాష్ రాజ్ అభిమాని అయిన ఓ మహిళ భర్త ఆయన ముందు దురుసుగా ప్రవర్తించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. దరుసుగా ప్రవర్తించిన అతని భార్య ప్రకాష్ రాజ్ తో కలిసి ఫొటో దిగిందట. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబందించిన వివరాలను ప్రకాశ్‌ రాజ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది తనను ఎంతో బాధించిందని ప్రకాష్ రాజ్ చెప్పారు. మనం ప్రేమించే వారిని ఇలా ఎందుకు బాధపెడుతారని ఆయన ప్రశ్నించారు. తాను కశ్మీర్ లోని గుల్మార్గ్‌ లో బస చేసిన హోటల్‌కి నడుచుకుని వెళ్తున్న సమయంలో.. ఓ మహిళ తన కూతురుతో కలిసి ప్రకాష్ రాజ్ దగ్గరకు వచ్చిందట. తనతో సెల్ఫీ దిగుతానని కోరిందట. అందుకు ప్రకాష్ రాజ్ అంగీకరించి.. సెల్ఫీ దిగేలోపే అక్కడికి మహిళ భర్త వచ్చాడని చెప్పాడు. 
prakash raj
ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి, కోప్పడ్డాడట. ప్రకాష్ రాజ్ తో దిగిన సెల్ఫీని డిలీట్‌ చేయమని గట్టిగా అరిచాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రకాష్ రాజ్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన ఇలా ప్రవర్తించాడట. సదరు మహిళ అక్కడే ఏడ్చేసిందట. ఏంజరిగిందో అర్ధం కాని ప్రకాష్ రాజ్ ఆమె భర్తను పక్కకు తీసుకెళ్లి.. సర్‌.. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుని, అందమైన పాపను నీకిచ్చి, జీవితాన్ని పంచుకోవడానికి.. తాను గానీ, మోదీ గానీ కారణం కాదని చెప్పాడట. వారు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నప్పుడు.. మీరూ అలానే వారినీ గౌరవించాలని చెప్పాడట. అతని నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడంతో బాధతో అక్కడి నుంచి వచ్చేశానని చెప్పారు ప్రకాష్ రాజ్. 
 

tags: prakash raj, prakash raj about selfi, prakash raj about woman selfi, prakash raj comments on woman selfi, actor prakash raj about woman selfi

Related Post