వైద్యురాలి ఆత్మహత్య… ఆలస్యంగా వెలుగులోకి..

news02 Feb. 28, 2018, 11:12 a.m. general

ఏం సమస్య వచ్చిందో ఓ వైద్యురాలు  విషాన్ని ఇంజెక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. వైద్యురాలు విశాఖపట్నానికి చెందిన నూకరాజు కుమార్తె ఎంవీవీ.లక్ష్మిగా తెలుస్తోంది. ఉద్యోగం కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్ కు వచ్చిన లక్ష్మి సైనిక్ పురిలోని హస్తినాపురిలో ఉన్న జేపీ టవర్స్ లో నివాసం ఉంటోంది.  అవివాహిత అయిన లక్ష్మి గాంధీ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా.. సివిల్ సర్జన్ గా సేవలు అందించారు. నెల క్రితమే ఆమె సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి పదోన్నతిపై వెళ్లారు. రెండురోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో  ఆమె స్వస్థలానికి వెళ్లినట్లు అంతా భావించారు. అయితే ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో వాచ్ మెన్ తో పాటు.. తోటి ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి చూశారు. లక్ష్మి విగతజీవిగా కనిపించింది. పక్కనే  సిరంజులు, ఇంజెక్షన్ సీసాలు ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. లక్ష్మి మృతి చెందిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

tags: doctor, suicide, kapra, gandhihospital, siddhipet

Related Post