సెల్ఫీ మత్తులో ఆస్పత్రి స్టాఫ్

news02 Aug. 31, 2018, 4 p.m. general

Harikrishna

హైదరాబాద్- సెల్ఫీ.. ఇపుడు ఎక్కడ చూసినా సెల్ఫీ పిచ్చే. సెలెబ్రెటీల నుంచి మొదలు సామాన్య జనం వరకు సెల్ఫీల గోలనే. సెల్ఫీల పిచ్చిలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం. ఇక ఇప్పుడు మనం సెల్ఫీల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే...

Harikrishna

పైన ఫోటో చూస్తున్నారు కదా.. మొన్న రోడ్ ప్రమాదంలో గాయపడి చనిపోయిన హరికృష్ణ కు ట్రీట్ మెంట్ ఇవ్వడం మాని ఆయన బెడ్ పక్కన నిలబడి సెల్ఫీ దిగుతున్నారు ఆస్పత్రి స్టాఫ్. ప్రాణాపాయ స్థితిలో హరికృష్ణ హాస్పిటల్ లో చేరితే స్టాఫ్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి సెల్ఫీ పిచ్చిలో పడ్డారో చూడండి. ఆస్పత్రి లో ఇలాంటి సిబ్బంది ఉన్నారు కాబట్టే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిగో ఇప్పుడు హరికృష్ణ విషయంలో ను ఇదే జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

tags: Hospital selfie, hospital staff selfie with harikrishna, kamineni staff selfie with harikrishna

Related Post