విమానంలో ఉగ్రవాదులున్నారా..

news02 Nov. 28, 2018, 8:33 a.m. general

boy

సోషల్ మీడియా ఎంత సరదానిస్తుందో.. ఒక్కసారి మన కొంపలను కూడా ముంచుతుంది. ఏ మాత్రం ఏమరపాటున్న ఇక అంతే సంగతులు. ఇందుకు ఈ రోజు జరిగిన సంఘటనే ఉదాహరణ. ఓ యువకుడు విమానం ఎక్కి ఫ్రెండ్ తో సరదాగా చాట్ చేయడం తన ఉనికికే ప్రమాదంగా పరిణమించింది. ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో యోగెన్ పొద్దార్ అనే కుర్రాడు ఎక్కాడు. విమానం బయలుదేరాక ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ.. విమానంలో ఉగ్రవాది ఉన్నాడు.. నేను అమ్మాయిల మనసులు కొల్లగొట్టేస్తాను అని మెస్సేజ్ పెట్టాడు. పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆ కుర్రాడు చేసిన మెస్సేజ్ చూశాడు. 

boy

దీంతో వెంటనే విమానంలోని సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పేశాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆ యువకుడి నుంచి ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు. ఫోన్ లో నిజంగానే విమానంలో ఉగ్రవాదులున్నారనే మెస్సేజ్ ఉండటంతో అత్యవసరంగా కోల్ కత్తాలో విమానాన్ని దింపేశారు. సదరు కుర్రాడు లగేజ్ స్వాదీనం చేసుకుని అంతా చెక్ చేశారు. ముంబయి దాడులు జరిగి నేటికి సరిగ్గా పదేళ్లవుతున్న నేపధ్యంలో ఆ కుర్రాడిని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఐతే ఆ కుర్రాడు కేవలం సరదాగా మాత్రమే ఫ్రెండ్ కు మెస్సేజ్ పంపానని చెప్పినా పోలీసులు మాత్రం వినిపించుకోవడం లేదు. 

tags: young boy, yong boy in flight, yogen poddar in air india flight, yogen poddar wrong messege in flight

Related Post