కులాలు-మతాలు ఎందిరా జంగిల్ ఫెలోస్..

news02 Sept. 18, 2018, 8:10 a.m. general

pranay

మొన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.  తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రణయ్ ని దారుణంగా హత్య చేసించాడు ఓ తండ్రి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయ నాయకుల నుంచి మొదలు ప్రజా సంఘాలు, విధ్యార్ది సంఘాలు ఈ అమానవీయ సంఘటనపై మండిపడుతున్నాయి. 

pranay

ఇదిగో ఇప్పుడు సినీ ప్రముఖులు సైతం మిర్యాలగూడ పరువు హత్యపై స్పందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ భహిరంగ లేఖ రాశారు. మానవత్వం కంటే కులం, మతం ఎక్కువని భావించే వారికోసమే ఈ లేఖ అని ప్రారంభించిన మనోజ్.. కుల..మతాలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు ప్రణయ్ చావుకు కారణమేనని అన్నారు. రాజకీయాలు, సినీహీరోలు, కుల మత సంఘాలు ఇలా ఏదైనా కుల మత ఘర్షణలు దారణమని చెప్పారు. కులం.. మతం ఓ జబ్బులాంటిదన్న మంచు మనోజ్.. మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను.. మన పిల్లలకు మెరుగైన సమాజాన్ని ఇద్దాం.. ప్రణయ్ భార్య, అతని కుటంబానికి ప్రగాఢ సానుభూతి అని లేఖలో పేర్కొన్నారు.

pranay

ఇక ప్రణయ్ పరువు హత్యపై మరో హీరో రామ్ స్పందించారు. ఓ పక్కన సెక్షన్ 377 ను కొట్టిన సుప్రీం కోర్టు.. అందరు ఒక్కటేనని చెబుతోంటే.. ఇక కులాలు.. మతాలు ఎంటిరా జంగిల్ ఫెలోస్ అని కామెంట్ చేశారు. ముందు మునుషుల్లా ప్రవర్తించడం నేర్చుకొండని రామ్ హితువు పలికారు. ఏదేమైనా మిర్యాలగూడ లాంటి పరువు హత్యలు ఇంకెక్కడా జరగకూడదని న్యూస్ పిల్లర్ కోరుకుంటోంది.

tags: pranay, amrutha, pranay amrutha, pranay murder, pranay murder case, pranay murder in miryalaguda, pranay murder in nalgonda, pranay murder case in nalgonda, pranay amrutha love story, film actors about pranay murder case, hero ram about pranay, hero manoj about pranay

Related Post