ఇన్నోవా కారు ఢీకొని చైన్ స్నాచ‌ర్ మృతి

news02 May 10, 2018, noon general

chine snacher
నిజంగా దేవుడున్నాడు. దోపిడులు, దొంగ‌త‌నాలు చేసిన వారికి శిక్ష‌లు ప‌డుతాయో లేదో తెలియ‌దు కానీ, పైనున్న దేవుడు మాత్రం త‌ప్ప‌క శిక్షిస్తాడ‌ని అంటారు. అచ్చంగా హైద‌రాబాద్ స‌మీపంలో ఇలాంటీ ఘ‌ట‌న‌నే చోటుచేసుకుంది. మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ లాక్కొని పారిపోతున్న దొంగ‌ను దేవుడు కారు రూపంలో వ‌చ్చి బుద్ధి చెప్పాడు. 

chinesnacher 2

మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ లాక్కొని రోడ్డుపై డివైడ‌ర్ దాటుతుండ‌గా ఇన్నోవా కారు ఢికొట్టింది. దీంతో దొంగ రోడ్డుపై ఎగిరిప‌డ్డాడు. రోడ్డుపై ప‌డ్డ దొంగపై నుంచి ఇన్నోవా వెళ్ల‌డంతో వాడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఈమొత్తం వీడియోను స్థానికులు త‌మ కెమెరా బంధించారు. ఈసంఘ‌ట‌న హైద‌రాబాద్ స‌మీపంలోని వ‌రంగ‌ల్‌-భువ‌న‌గిరి ర‌హ‌దారిపై జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే దొంగ‌లు దొరికితే ఖాకీలు క‌ఠిన శిక్ష‌లు ప‌డేలా చేస్తారో లేదో కానీ, భ‌గ‌వంతుడు దొంగ‌కు స‌రైన బుద్ధి చెప్పాడ‌ని ఈవీడియో చూసిన వారు అనుకుంటున్నారు. మీ కోసం ఆవీడియో...

 

tags: chinesnacher,theift,warangal,bhovanagiri,hyderabadroad,police,god

Related Post