ఎప్పుడైనా దాడులు జరగవచ్చు..

news02 Oct. 30, 2018, 7:18 p.m. general

maoists

మావోయిస్టుల ఉనికి పెద్దగా లేదని అంతా అనుకుంటున్న సమయంలో ఓ కొత్త నిజం బయటకు వచ్చింది. మొన్న అరకులో ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ను మావోయిస్టులు కాల్చి చంపాక కూడా.. మావోయిస్టులు అంతకంతకు అంతరించిపోతున్నారని.. అందుకే తమ ఉనికిని చాటుకునేందుకే దాడులకు పాల్పడ్డారని పోలీసులు అభిప్రాయపడ్డారు.  అంతే కాదు మహా అయితే సుమారు 100 మంది వరకు అజ్ఞాతం లో ఉండి ఉంటారని.. మిగతా వాళ్లంతా పలు ఎన్ కౌంటర్ లు, లొంగుబాట్లతో క్యాడర్ మొత్తం పోయిందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఐతే పోలీసుల అంచనాలు తప్పని ఇప్పుడిప్పుడే తెలుస్తోందట. ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ పార్టీ మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుందని తెలుస్తోంది. 

maoists

పెద్ద ఎత్తున యువతను ఆకర్షించి మావోయిస్టులు పార్టీలోకి రిక్రూట్ చేసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎప్పుడైనా గెరిల్లా దాడులు జరగవచ్చని.. అప్రమత్తం గా ఉండాలని  తెలంగాణా, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఇక టార్గెట్స్ పై ఎలా దాడులు నిర్వహించాలి, శత్రువు ను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎదురు కాల్పుల సమయంలో ఏ విధంగా వ్యవరించాలి అనే అంశం పై కొత్త క్యాడర్ కి మావోయిస్ట్ పార్టీ తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని దండకారణ్యం లో శిక్షణ ఇస్తున్నారని సమాచారం. ఈమేరకు ఇందుకు సంబందించిన వీడియో ఎక్స్ క్లూజివ్ వీడియో మీరే చూడండి. 

tags: maoists, maoists training, maoists recruitment, ib alerts state governaments, central ib alerts state governaments

Related Post