కోకకోలా స్మార్ట్ ఫోన్ ఆఫర్

news02 Dec. 21, 2018, 7:26 a.m. general

coco

సరిగ్గా సంవత్సర కాలం పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉండగలరా.. అలా ఐతే ఈ గోల్డెన్ చాన్స్ మీకోసమే. అమెరికా కోకకోలా సంస్థకు చెందిన విటమిన్‌ వాటర్ అనే కంపెనీ నో ఫోన్‌ ఫర్‌ ఎ ఇయర్‌ పేరిట ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. సంవత్సర కాలం పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉంటే  72 లక్షల రూపాయలు చెల్లిస్తుందట ఆ కంపెనీ. ఈ విషయాన్ని విటమిన్‌ వాటర్‌ కంపెనీ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. హా ఇందులో ఏముంది కంపెనీకి తెలీకుండా దొంగచాటుగా ఫోన్‌ వాడేసి ఆ తర్వాత అసలు నేను ఫోనే వాడలేదు అని చెబితే మాత్రం కుదరదండీ బాబు. ఈ పోటీలో పాల్గొనే వారికి సరిగ్గా ఏడాది త్వారత కంపెనీ లై డిటెక్టర్‌ ద్వార పరీక్ష చేస్తుంది. 

coco

దీన్ని బట్టి సదరు వ్యక్తి స్మార్ట్ ఫోన్ వాడారా.. లేదా అనేది ఖచ్చితంగా తెలిపోతుంది. ఇక ఈ పోటీలో ఓ వెసులుబాటు కూడా ఉంది. అదేంటంటే పోటీదారులకు కంపెనీ 1996 కాలం నాటి పాత మోడల్ ఫోన్ ఒఖటి ఇస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌కి బదులు సంవత్సరం పాటు ఇదే టెలిఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విటర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జనవరి 8, 2019 నుంచి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్మార్ట్ ఫోన్ ను యేడాది పాటు వాడకుండా ఉడగలమని మీరు అనుకుంటే.. పోటీకీ రెడీ అయిపోండి.

tags: coco, coco cola, coco cola smart phone contest, coco cola vitamin water, vitamin water smart phone contest

Related Post