అంతరించిపోతున్న రాబంధు

news02 May 19, 2019, 9:15 p.m. general

rabandhu

ప్రస్తుతం అంతరించిపోతున్న పక్షి జాతుల్లో రాబంధు అత్యంత కీలకమైంది. గతంలో వందల సంఖ్యలో ఉన్న రాబందులు క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. సుమారు 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ రాబంధు కనిపించింది. బాగా నీరసించి, ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును అటవీశాఖ రక్షించింది. హైదరాబాద్ లోని ఆసిఫ్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతంలో రాబందు ఉందని స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. రాబందును జూపార్క్‌కు తరలించారు. శనివారం నాటికి కోలుకున్న రాబందు మధ్యాహ్నం కాస్త మాంసం తిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక రాబందు పక్షి జాతి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే దశలో ఉంది. గతంలో ఆఖరిసారిగా హైదరాబాద్‌లో 1999-2000 సంవత్సరంలో హయత్‌నగరలోని మహావీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో రాబంధు కనిపించింది. ఆ తర్వాత ఇన్నేళ్ల తరువాత రాబంధు కనిపించడం ఇదే తొలిసారని అటవీశాఖవర్గాలు చెప్పాయి. 

tags: rabandhu, vulture in hyderabad, vulture, rare vulture in hyderabad, vulture in hyderabad after 20 years

Related Post