మ‌హేంద‌ర్ రెడ్డికి చేదు అనుభ‌వం

news02 June 25, 2018, 4:30 p.m. general

minister convoy py stones
హైద‌రాబాద్: తెలంగాణ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన మృతుల కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌నకు ఆందోళ‌న‌కారులు చుక్క‌లు చూపించారు. సోమ‌వారం ఉద‌యం రంగారెడ్డి జిల్లా మంచాల మండ‌లం లింగంప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వ‌స్తున్న కారు,ఆటో ఢీకొని 5గురు మృతి చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

minister mahender reddy

అయితే విష‌యం తెలుసుకున్న మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి...మృతుల కుటుంబీకులు, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మంచాల‌కు వెళ్లారు. అయితే అప్ప‌టికే ర‌హ‌దారిపై న్యాయం చేయాల‌ని ధ‌ర్నా చేస్తున్న మృతుల కుటుంబీకులు,ఆందోళ‌న‌కారులు మంత్రి రాగానే రెచ్చిపోయారు. కాన్వాయిపై ఒక్క‌సారిగా రాళ్లు విసిరారు. మృతుల కుటుంబీకుల‌కు రూ.25 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అయితే ప‌రిస్థితి ఉధృతంగా మార‌డంతో...పోలీసులు మృతుల కుటుంబీకుల‌ను శాంతింప‌జేసి...ప‌లువురుని అదుపులోకి తీసుకున్నారు. 
 

tags: mahender reddy convoy py stones,transport minister,minister mahender reddy family,minister mahender reddy,transport minister mahender reddy,trs minister mahender reddy, telangana minister mahender reddy,minister mahender reddy images,minister mahender reddy address,p mahender reddy minister mahender reddy minister family,mahender reddy transport minister,transport minister

Related Post