ప్ర‌ధాన అర్చ‌క్షుడు ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న కామెంట్స్‌

news02 May 16, 2018, 3:24 p.m. general

ttt 3
తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన ఆర్చ‌కులు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యాన్ని రాజ‌కీయ నాయ‌కులే భ‌ష్ట్రు ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేవ‌స్థానానికి సంబంధించిన ప‌లు విభాగాల్లో వేలు పెడుతున్నార‌ని తెలిపారు. దేవ‌స్థానానికి సంబంధిన అభివృద్ధిపై వారికి ఎలాంటీ ధ్యాస లేద‌న్నారు. చివ‌ర‌కు భ‌క్తుల ఆరాధ‌న‌తో స్వీక‌రించే ల‌డ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపారంగా మార్చ‌డం దారుణ‌మ‌న్నారు. అధికారులు కూడా స్వామి వారి కైంక‌ర్యాల్లో త‌ల‌దూర్చుతున్నార‌ని విమ‌ర్శించారు. అర్చ‌కుల‌ను అధికారులు బెదిరిస్తూ... ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని వాపోయారు. 

ttd 2

ప్ర‌ధాన అర్చ‌కుడినైన త‌న‌కే స్వామి ఆభ‌ర‌ణాల వివ‌రాలు తెలియ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిన‌ ఆభరణాలు ఎక్కడున్నాయో ఆచూకీ లేద‌న్నారు. 1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ర‌ద్దు చేసింద‌ని.. అప్ప‌టి నుంచి  ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. 

tags: ttd,ramanadishtitulu,turumala,chandrababu,venkatewhwara swamy,balaji

Related Post