ఇద్దరి మనసులు కలిశాయి

news02 Jan. 3, 2019, 7:29 a.m. general

girl

వారిద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వారు. ఐనా ఇద్దరి మనసులు కలిశాయి. ఇంకేముంది ఇరువురి తరపు పెద్దల దీవెనలతో ఒక్కటయ్యారు. అవును ఓ తెలుగు అబ్బాయి.. మరో అమెరికా అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అచ్చతెలుగు పెళ్లి చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన కోనేరు సాయితేజ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం  అతనితో కలిసి పనిచేస్తున్న అమెరికా యువతి అనెల్లతో పరిచయం అయింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని తల్లితండ్రులు, కుటుంబ పెద్దలకు చెప్పగా అందుకు వారు ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. పెద్దల ఆశీర్వాదంతో సాయితేజ, అనెల్లా విజయవాడలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు.

 

tags: america girl andhra boy, us girl andhra boy, america girl andhra boy love affair, america boy andhra boy marriage

Related Post