ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వని ప్రభుత్వం..

news02 Sept. 23, 2018, 9:38 a.m. general

students

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంజినీరింగ్ విధ్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారింది. ఇంజినీరింగ్ విధ్యార్ధులకు ఇప్పటివరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ నిలిచిపోవడంతో విధ్యార్ధులు తీవ్ర ఆవేధనకు గురవుతున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో క్వాలిఫైడ్ లెక్చరర్లు లేకపోవడం, కాలేజీలపై ప్రభుత్వ నియంత్రన లోపంతో విధ్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

students

కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద విధ్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 16వేల మంది విధ్యార్ధులు ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. ఫీజు రీయంబర్స్ మెంట్ కింద ఒక్కో పేద విధ్యార్ధికి నాలుగేళ్లుగా రావాల్సిన ఫీజు బకాయిలు 1లక్షా 40వేల రూపాయలను కేసీఆర్ సర్కార్ ఇవ్వకపోవడంతో విధ్యార్ధుల బతుకులు రోడ్డుమీదికొచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని.. నిరుపేదలన్న జాలీ కలగడం లేదని విధ్యార్ధులు వాపోతున్నారు. 

students

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య నాణ్యత కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పోరేట్ కళాశాలలకు ప్రభుత్వ పెద్దలు దాసోహం కావడంతో.. చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజ్ లు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఇంజినీరింగ్ చదివినా సర్కార్ నిర్వాకం వల్ల అందులో నాణ్యత లేకుండా పోతోందట.  కేసీఆర్ సర్కార్ ఫీజురీయంబర్స్ మెంట్ ఇవ్వకున్నా.. అప్పో సప్పో చేసి ఇంజినీరింగ్ చదివించిన తల్లిదండ్రులు.. వారి పిల్లలకు సరైన ఉద్యోగాలు రాక.. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా, కాల్ సెంటర్ లో ప్రధాన్యం లేని ఉద్యోగాలు చేస్తున్నారని  వాపోతున్నారు.
 

 

tags: students, students fire on kcr, students fire on kcr govt, engineering students fire on kcr, engineering students fire on kcr govt, engineering students agitation

Related Post