గురకని లైట్ తీసుకుంటే అంతే…

news02 March 12, 2018, 4:40 p.m. general

చాలామందిలో ఉన్న సమస్య నిద్రపోయేటపుడు గురకపెట్టడం. గురకపెట్టేవారి వల్ల చుట్టుపక్కల నిద్రించేవారికి తీవ్ర నిద్రాభంగం అవుతుంటుంది. ఈ సమస్యతో చాలామంది తమ బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి ఉండటానికి కూడా గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఇది పెద్ద సమస్య అంటే చెప్పలేం.. కానీ వదిలిపెట్టే సమస్య మాత్రం కాదని డాక్టర్లు చెబుతున్నారు. దీనిని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలు పాటించాలని అంటున్నారు.

స్థూలకాయంతో బాధపడేవారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. దీనిని నుంచి బయటపడాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. శరీరానికి తగిన వ్యాయామం చేయాలి. ముఖ్యంగా నూనె పదార్ధాలు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.. ఇక నిదురించేటపుడు ఏదో ఒక వైపు పడుకోవాలి. ముఖ్యంగా మద్యం, సిగరెట్లు వంటి అలవాట్లు ఉన్నవారు పూర్తిగా వాటిని మానేయాలి. రోజులో ఒకసారైన స్వచ్ఛమైన వాతావరణంలో  రెండు నిముషాలపాటైనా ఊపిరి గట్టిగా పీల్చి వదలాలి. ఇక రోజులు గడుస్తున్నా గురక తగ్గని వారు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే గాలి పీల్చుకునే ద్వారాల్లో ఏమైనా సమస్యలు తలెత్తినపుడు కూడా గురక వచ్చే అవకాశం ఉందట. సో. గురకే కదా.. అని తేలిగ్గా తీసుకోవద్దు. వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

 

Related Post