పూణె-హైదరాబాద్- ప్రదాని మోదీ హత్యకు కుట్ర కేసులో మొన్న మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వరవరరావును ఈ ఉదయం హైదరాబాద్ తీసుకొచ్చారు. మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని అందుకు సంబందించిన లేఖలో వరవరరావు పేరు ఉందన్న కారణంతో పూణె పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పూణెకు తరలించారు. వరవరరావు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వరవరరావును జైళ్లో ఉంచరాదని.. గృహనిర్భంధంలో ఉంచాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక వరవరరావును సెప్టెంబర్ 6వరకు గృహ నిర్బంధంలో ఉంచనున్నారు పోలీసులు. వరవరరావుతో పాటు దేశవ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ చేసిన పౌరహక్కుల నేతలు మరో ఐదు మందిని సైతం వారి వారి నివాసాలకు తరలించారు.