వరదలు వరదలే..

news02 Aug. 29, 2018, 7:37 a.m. general

kerala

తిరువనంతపురం(నేషనల్ డెస్క్)- దేవోరుల స్వర్గంగా చెప్పుకునే కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిని సంగతి తెలిసింది. దాదపు రెండు నెలల పాటు కేరళను వరదలు ముంచెత్తాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయలయ్యారు. నాలుగు వందల మందికిపైగా చనిపోయారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. ఉళ్లకు ఉళ్లన్నీ చెరువుల మాదిరిగా మారిపోయాయి. అయినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం కేరళ వాసులు వెనకడుగు వేయలేదు. అదేంటని అనుకుంటున్నారా..

kerala

అసలు విషయం ఏంటంటే.. వరదలు ముంచెత్తి కేరళ అతలాకుతలం అయినా.. మందు తాగడం మాత్రం మానలేదు. కేరళలో తీవ్ర వరదలు వచ్చిన కీలక సమయం అంటే ఆగష్టు 15నుంచి 26వరకు మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఈ పది రోజులపాటు 516 కోట్ల రూపాయల మందును తాగారట మందుబాబులు. మరందుకే మందు మందే.. వరదలు వరదలే అన్నారు.

tags: kerla, kerala floods, kerala wine sales, kerala liquer sales, liquer sales in kerala floods, liquer sales at flood time in kerala

Related Post