ఇండోనేషియాలో సునామి

news02 Dec. 24, 2018, 8:23 p.m. general

tsunami

వరుస సునామీలతో అతలాకుతలం అవుతున్న ఇండోనేషియాను మరో సునామీ ముంచెత్తిందిగత రాత్రి ఇండోనేషియాలోని దక్షిణ లాంపంగ్‌, పండేగ్లాంగ్, సెరాంగ్‌ ప్రాంతాల్లో ముంచుకొచ్చిన సునామీ ధాటికి మొత్తం 300 మంది చనిపోయారు. అంతే కాకుండా 900 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సునామీకి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సునామీ ధాటికి వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. ఇక సునామి నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని ఆ దేశ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. 

tsunami

గత రాత్రి దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో సునామీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం బద్దలవడంతో ఈ విపత్తు సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాధితులకు తక్షణం పునరావాసం కల్పిస్తున్నట్లు విపత్తు నిర్వహణా అధికారులు పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు చేపట్టామని వారు చెప్పారు. క్రాకటోవ్‌ దీవిలోని అగ్నిపర్వతం బద్దలవడంతో అందులో నుంచి వెలువడ్డ లావా, బూడిద 500 మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడిందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. 

tags: tsunami, stunami indonesia, indonesia tsunami, 300 died in indonesia tsunami, indonesia tsunami 300 died

Related Post