మంచి మనుసును చాటాడు..

news02 Sept. 3, 2018, 2:46 p.m. general

kerala beggar

తిరువనంతపురం- కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళను ఆదుకోవడానికి చాలా మంది ప్రముఖులు విరాళాలిచ్చి తమ వంతు సాయం చేశారు. ఐతే కేరళకు ఉడతా భక్తి సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడో బిచ్చగాడు. కొట్టాయం ప్రాంతానికి చెందిన మోహన్ అనే వృద్దుడు బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడు. తనకెవ్వరు లేని అనాధ. 

beggar

గతంలో మావటిగా పనిచేసిన మోహన్ ప్రమాదంలో అవిటి వాడు కావడంతో అప్పటి నుంచి బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడు. ఇక మొన్న కేరళ వరదలకు జనం కష్టాలు చూసి చలించిపోయాడు. తానేం చేయలేకపోతున్నానని ఆవేధన చెందాడు. తనకు తోచిన సాయం చేయాలని భావించిన సదరు బిచ్చాగాడు.. తాను బిచ్చమెత్తుకోగా జమైన 94 రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించి తన మంచి మనసును చాటుకున్నాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికి తెలియడంతో ఇప్పుడంతా ఆ బిచ్చాగాడి ఔదార్యానికి అచ్చెరువోందుతున్నారు.

tags: beggar, kerala begger, beggar mohan, kerala beggar mohan, kerala beggar donation, kerala beggar mohan donation, beggar mohan donation for kerala

Related Post