ఫిదా చేస్తున్న ప్రేమమ్ పిల్ల

తెలుగు సినిమాలో మృదువుగా మాట్లాడే హీరోలు కనిపించారు అంటే అది ఎవరి సినిమానో మనం ఇట్టే పసికట్టేస్తాం. శేఖర్ కమ్ముల సినిమా అంటే మెట్రో సినిమా ప్రేక్షకులులలో కొంచెం  ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే శేఖర్ సినిమాలు అన్నీ మెట్రో జీవితాలతో ముడిపడి ఉన్న కథలుగానే ఉంటాయి. తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కొన్ని ఫ్లాప్ సినిమాలు తరువాత ఒక కమర్షియల్ సినిమాతో యంగ్ లవ్ స్టోరీతో తెలంగాణ అమ్మాయి ప్రేమకథ గా ఈరోజే 'ఫిదా' చేయనున్నాడు.

ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి అందరి దృష్టి హీరోయిన్ సాయి పల్లవి పై ఉంది. ప్రేమమ్ సినిమా ఫేమ్ తో సౌత్ మొత్తం పాపులర్ అయన ఈ మలయాళం హీరోయిన్ ఇప్పుడు ఈ సినిమాలో తానే స్వయంగా తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పింది. తెలంగాణ డైలాగ్ తో మొదలైన ఈ ఫిదా ప్రోమో అలా అలా పెరిగి ఇప్పుడు 'వచ్చిందే పాటతో' అమ్మడు మీద ఫోకస్ పడింది. ఈ పాటలో సాయి పల్లవి నడుము తిప్పుతూ చేసిన డాన్స్ ఇప్పుడు వచ్చిన హీరోయిన్లు అందరి కంటే కొంచం అందంగా వేసిందనే చెప్పాలి. శక్తి కాంత్ ఇచ్చిన సంగీతానికి సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను సాయి పల్లవి స్టెప్పులతో అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా విడుదల సందర్భంగా వచ్చిన ప్రోమోలో ఆమె ఆడించిన నడుముతో సినిమా హాల్ కి రమ్మని పిలుస్తునట్లు ఉంది.

నిజానికి వరుణ్ తేజ్ ఈ సినిమా పై ఈ సినిమా ఫలితం పై కొంచెం   కంగారుగానే ఉన్నాడు. తన మొదటి సినిమా కూడా మంచి కథాంశమే అయినా అది ఫెయిలైంది. అలాగే రెండో సినిమా కంచె కూడా ఆవెరేజ్ గానే ఆడింది. మూడో సినిమా లోఫర్.. ఆ తరువాత మిస్టర్ గురించి చెప్పే పనే లేదు. ఇప్పుడు ఫిదాతో టాలెంటెడ్ టీమ్ తో వస్తున్న వరుణ్.. ఎలాంటి రిజల్ట్ చూస్తాడో చూద్దాం.


Leave your comment