కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లిన కోదండరాం

హైదరాబాద్ : అవును జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లారు. కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చేందుకే కోదండరాం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారని కోదండరాం ..కాంగ్రెస్ నేతలతో దూరంగా ఉంటున్నారు. అయితే నెరేళ్ల సంఘటనపై గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన అఖిలపక్షంతో కోదండరాం కూడా వెళ్లారు. అఖిలపక్షంలో టిడిపి, బిజెపి ఇతర ప్రజాపక్షాలున్నా కోదండరాం కాంగ్రెస్ నేతలతో కలివిడిగా కనిపించారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ తో నేతృత్వంలోనే ఈ అఖిలపక్షం గవర్నర్ Nయూ కలిసింది. ఈ సందర్బంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఇసుక దందా నడుస్తుందని దాని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రమేయం తోనే నెరేళ్ల లో దళితులపై పోలీస్ లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. కేసీఆర్ ఫ్యామిలీయే ఇసుక దందా నడిపిస్తున్నదని ఉత్తమ్ ఆరోపించారు.


Leave your comment