1947 అగ‌స్టు 15 న పేప‌ర్లో వ‌చ్చిన వార్త‌లు చ‌దివారా..

స్వాతంత్రం వ‌చ్చి 71 యేళ్ళు గ‌డిచింది. గ‌తం గ‌త‌హా త‌ర‌హా అన్ని మ‌ర్చిపోవ‌టం మనుషుల‌కు అల‌వాటు. ఇక వార్త‌ల విష‌యానికి వ‌స్తే నిన్న‌టి పేప‌ర్ నేటి చిత్తు కాగితం అనే సూత్రం ఉండ‌నే ఉంది. నిజంగానే పేప‌ర్ లో వార్త ను చ‌దివిన త‌ర్వాత దాన్ని చిత్తు కాగితంగానే వాడుతాం.. కాని అదే పేప‌ర్ కొన్ని యేళ్ల త‌ర్వాత చూస్తే ఒకింత పుల‌కింత పుడుతుంది. క‌రెక్ట్ గా అలాందిటే ఈ వార్త పేప‌ర్‌. స్వాతంత్రం వచ్చిన మ‌రుస‌టి రోజు పేప‌ర్ ఇది. 

అప్ప‌ట్లో ప్ర‌ముఖ పత్రిక అయిన ఆంధ్ర ప‌త్రిక ప్ర‌తి ఇది. 1947.. అగ‌స్టు 15 నాటి ప‌త్రిక ఇది. అగ‌స్టు 14 అర్ధ‌రాత్రి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు మ‌ర‌స‌టి రోజు పత్రిక‌లో ప్రింట్ అయ్యాయి. 71 యేళ్ళ నాటి ఈ ప‌త్రిక స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోష‌ల్ మీడియాలో విస్తృతంగా స‌ర్కులేట్ అవుతోంది. పండిట్ జ‌వ‌హాల్ నెహ్రూ ప్ర‌తి పాదించిన ప్ర‌మాణ స్వీకార తీర్మాణానికి స‌భ్యుల ఆమోదం పేరుతో ఆంద్ర ప‌త్రిక‌లో అచ్చు అయిన వార్త‌నే హెడ్ లైన్ లో ఆ పత్రిక‌లోని వార్త‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. 


Leave your comment