ఆమెకు మరీ అంత డిమాండా...

సినిమా పిల్లర్- మొన్న విడుదలైన శెఖర్ కమ్ముల  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులు తనపై ఫిదా అయ్యేలా చేసింది అందాల భామ సాయి పల్లవి. అవడానికి కేరళ అమ్మాయి అయినా తెలుగు భాషనీ ఓడిసిపట్టుకొని నటనలో జీవించింది. అందుకే ఫిదా సినిమాతో నూటికి నూరు మార్కులు కొట్టేసింది ఈ నెరజాన. ఫిదా సినిమాతో ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది సాయి పల్లవి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయిందీ భామ.
ఇంకేముంది సహజంగానే తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట సాయిపల్లవి. ఫిదా సినిమాలో ఈ భామ నటన చూసి మంత్ర ముగ్ధులు అయిన దర్శకనిర్మాతలు సాయి పల్లవితో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారట. ఇంత డిమాండ్ రావడంతో ఆమె పారితోషికం బాగా పెంచేసిందని టాక్. ఇక సాయిపల్లవి ఎంత పారితోషికం అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్దంగా ఉన్నారట. ప్రస్తుతం ఈ అమ్మడు నానితో ఎం.సి.ఏ సినిమా చేస్తోంది. మరి కొన్ని సినిమా కధలు వినే పనిలో ఉందీ పాప.


Leave your comment